Friday, March 13, 2009

సానుభూతి అనే భూతం

ఈ రోజులలో ప్రతి చోట చూస్తున్న ఒకే ఒక భూతం సానుభూతి. ఇది ఆశించడమే కానీ చూపించదమన్నది ముఖ్యం కాదనుకోవడం కారణమేమోప్రతిచోటా ఇదే కనబడుతోంది. కొన్ని ఉదాహరణలు
  • సామజిక న్యాయం అనే పేరుతొ ప్రతి పార్టీ వోట్లు ఆశించడం
  • ఆఫీసు లో పని చెయ్యని వాళ్ళు బాస్ తిడితే సహా ఉద్యోగుల నుండి సానుభూతి ఆశించడం
  • తల్లి తండ్రి వాళ్ళ యవ్వనంలో ఎలా ప్రవర్తించినా కొడుకు వాళ్ళలా కాకుండా శ్రీ రాముడిలా వుండాలని ఆశించడం

విదుర నీతి దీనికి సమాధానం కావచ్చేమో!

"ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబున కగు
తా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పతములకేల్లన్ "

అంటే మన కేదైతే బాధ కలిగిస్తుందో అది ఎదుటి వాళ్ళకు చెయ్యకూడదు.